ELR: పెదవేగి పరిధిలో ప్రమాదకర ప్రాంతమైన రాట్నాల కుంట మలుపు కేంద్రం వద్ద ఇవాళ కుంభాకార అద్దాలను సీఐ రాజశేఖర్ ఏర్పాటు చేశారు. సీఐ మాట్లాడుతూ.. ప్రమాదకరమైన మలుపుల వద్ద వాహనదారులు ఎదురుగా వస్తున్న వాహనాలను సులభంగా చూసేందుకు ఈ అద్దాలను ఏర్పాటు చేశామన్నారు. అతివేగంగా వస్తున్న వాహనాలను అంచనా వేయడానికి, తద్వారా రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చన్నారు.