కోనసీమ: గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘా పిలుపు మేరకు తమ న్యాయమైన డిమాండ్లు అమలు చేయాలని రాజోలు మండల VRAలు కోరారు. ఇందులో భాగంగా శుక్రవారం రాజోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసి ధర్నా చేశారు. కాగా, అనేక ఏళ్ళుగా తమ సమస్యలు పరిష్కారం నోచుకోలేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ భాస్కర్‌కు వినతి పత్రం అందజేశారు.