SKLM: ఎచ్చెర్ల మండలం రామ్ నగర్ వీధిలో ఆదివారం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలు నమ్మి, టీడీపీ సభ్యత్వాన్ని తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మెండ రాజారావు, భాస్కరరావు, మల్లేశ్వరరావు, రమణ ఉన్నారు.