PLD: జిల్లాలో ఎస్పీ కృష్ణారావు ఎస్సైల బదిలీలకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 22 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ, వారికి కొత్త పోస్టింగ్లు ఇచ్చారు. బదిలీ అయిన ఎస్సీలు వెంటనే తమకు కేటాయించిన కొత్త స్టేషన్లలో విధుల్లో చేరాలని ఎస్పీ కృష్ణారావు ఆదేశించారు.