E.G: గోపాలపురం చివరిలో నాటుసారా తయారీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని,వారిని కొవ్వూరు కోర్టుకు హాజరు పరిచినట్లు SI మనోహర్ తెలిపారు. గోపాలపురం గ్రామ చివరిలో ఉప్పరగూడెం గ్రామానికి చెందిన గంగోలు శ్రీను,ఎర్నగూడెం గ్రామానికి చెందిన శంకర్లు నాటుసారా తయారు చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు తమ సిబ్బందితో దాడి చేసినట్లు SI వివరించారు.