ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు చెప్తూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. అందులో తెలుగు జెండా రెపరెపలాడుతోంది అని రాశారు. అయితే.. దాన్ని తప్పు పడుతూ బాలీవుడ్ గాయకుడు అద్నాన్ సమీ పెట్టిన ట్వీట్ పై ఏపీ మంత్రులు మండిపడుతున్నారు. బుధవారం నాడు సీఎం జగన్ చేసిన ట్వీట్ కింద.. సింగర్ అద్నాన్ సమీ ‘దేశం నుంచి వేరుగా ఉండటానికి ట్రై చేయకండి’ అని ట్వీట్ చేశారు. దీంతో వైసీపీ మంత్రులు, శ్రేణులు ముప్పేట దాడికి దిగుతున్నారు. మంత్రులు అద్నాన్ సమీని టార్గెట్ చేసి ట్వీట్లు చేస్తున్నారు. తెలుగు పతాకమా..? అని సందేహాం వ్యక్తం చేశారు. మీరు చెబుతుంది భారతీయ పతాకం కాదా అంటూ వ్యంగంగా పెట్టిన పోస్టుకు ఏపీ మంత్రులు, వైసీపీ నాయకులు సమీని ఓ రేంజ్ లో ఉతికి ఆరేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి విషయంలో అంతా ఒకే దేశం. తొలుత మనం భారతీయులం. మీరు భారత్ నుంచి వేరుగా ఉండటానికి ప్రయత్నించకండి అని రాశారు. 1947లో చూసిన వేర్పాటువాద వైఖరి మంచిది కాదని అంటూనే.. జై హింద్ అని ట్వీట్ చేసిన సమీ ట్వీట్ ని ట్యాగ్ చేస్తూ.. తెలుగు సినిమా అని రాయడానికి మనసు ఒప్పుకోలేదా ? అంటూ ప్రశ్నిస్తున్నారు.
Telugu flag? You mean INDIAN flag right? We are Indians first & so kindly stop separating yourself from the rest of the country…Especially internationally, we are one country! This ‘separatist’ attitude is highly unhealthy as we saw in 1947!!! Thank you…Jai HIND!🇮🇳 https://t.co/rE7Ilmcdzb
అద్నాన్ సమీ ట్వీట్‌కు వైసీపీ నేతలు, కొందరు నెటిజనులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా తెలుగు సినిమా ఇండియా గర్వపడేలా చేసింది అని రాస్తే బాగుండేది. అదే నిజం కూడా.. అని మరో పోస్ట్ చేశారు. మంత్రులు విడుదల రజనీ, గుడివాడ అమర్ నాథ్ సమీకి కౌంటర్ ట్వీట్ చేశారు. తెలుగు సినిమా అయినందున అలా తెలుగు జెండా అని రాశారని తెలిపారు. విభేదాలు తీసుకొచ్చేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని వారు సమీని ప్రశ్నించారు. తాము తెలుగువారిగా గర్వపడుతున్నాం అని.. తమ దేశభక్తి గురించి మాట్లాడే హక్కు మీకు లేదని తెలిపారు. తెలుగు సినిమా అయినందున తెలుగు జెండా అనే పదం వాడామని తెలిపారు.