మూడు రాజధానుల పేరుతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రను నాశనం చేయాలని చూస్తున్నారని…టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇప్పటికే YSRCP నేతలు ఉత్తరాంధ్రలో 40 వేల ఎకరాలు ఆక్రమించారని పేర్కొన్నారు. విశాఖలో విజయసాయికి వందల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.
ఈ క్రమంలో అనేక మంది విశాఖ వాసులు భయాందోళన చెందుతూ…నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని వెల్లడించారు. ఈ క్రమంలో విశాఖలో భూ దోపిడీ అంశంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వికేంద్రీకరణ పేరుతో YSRCP దోచుకునేందుకు ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేశారు. సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో ఆందోళన చేపడతామని వ్యాఖ్యానించారు.