కర్ణాటక(karanataka)లోని యాదగిరిగి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Accident) సంభవించింది. ఆగిఉన్న లారీని వేగంగా వచ్చిన జీపు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన ఐదురుగు మరణించారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. మృతులు మునీర్, నయామత్, రమీజా బేగం, ముద్దత్ షీర్, సుమ్మి ఉన్నట్లు గుర్తించారు. అయితే వీరంతా నంద్యాల జిల్లా వెలగోడు మండలానికి చెందినవారని తెలుస్తోంది. బాధితులు కలబురిగిలోని దర్గా ఉరుసు జాతర(ursu jatara)కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.