VSP: లాభాల్లో నడుస్తున్న పోర్టు హాస్పిటల్‌ను ప్రైవేటు వారికి అప్పగించడం అన్యాయమని CITU యూనియన్ కార్యదర్శి బీ.జగన్ అన్నారు. గురువారం పోర్టు హాస్పిటల్ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రైవేటీకరణను ఆపాలని, టెండర్స్ రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ.. నిరసనలు చేశారు. పోర్టు ఆసుపత్రి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టి నేటికీ 356వ రోజు అని తెలిపారు.