KRNL: జిల్లాలో గ్రూపు-2 మెయిన్స్ పరీక్షల పకడ్బందీ ఏర్పాట్లపై APPSC జిల్లా కోఆర్డినేటర్, జేసీ డాక్టర్ బి. నవ్య సోమవారం కలెక్టరేట్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా పరీక్ష నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని, లైజన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.