W.G: నాటి ఎంపీ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి చెప్పిన సమాధానాలపై బుధవారం ఉండిలో ఆయన ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విచారణకు హాజరైన ఆమె వింత సమాధానాలు వింటే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే అన్నారు. MBBS చదివిన ఆమెకు శరీరంపై గాయాలు గురించి అవగాహన లేదనడం వింతగా ఉందన్నారు.