NLR: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఊరట లభించింది. రుస్తుం మైనింగ్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసే వరకు నెల్లూరు జిల్లాకు వెళ్లొద్దంటూ విధించిన షరతుల పై స్టే ఇచ్చింది. దీంతో ఆయన నెల్లూరు కేంద్రంగా రాజకీయాలు చేయబోతున్నారు. ఈ మేరకు ఆయన శనివారం మధ్యాహ్నం నెల్లూరుకు రానున్నట్లు సమాచారం. మిగిలిన షరతులను యథాతధంగా ఉంచింది.