PLD: బీఆర్ అంబేద్కర్ను పార్లమెంట్ సాక్షిగా అవహేళనగా మాట్లాడిన అమిత్ షా పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు నరసరావుపేట చిత్రాలయ సెంటర్లో ఆదివారం సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య మత విద్వేషాలను రగులుస్తుందని మండిపడ్డారు.