NLR: ఫ్లెమింగో ఫెస్టివల్- 2025 సందర్భంగా బీవీ పాలెం వద్ద బోట్ సర్వీస్ ఏర్పాటు చేశారు. దీంతో యువత, విద్యార్థులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు బోటులో షికారు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్ల ఏర్పాటు, బోటులో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసి భద్రతా చర్యలతో బోటు నడుపుతున్నట్లు జిల్లా కలెక్టరేట్ అధికారులు తెలిపారు.