నెల్లూరు: సజ్జాపురం గ్రామంలో ఆదివారం ఉదయం 7 గంటలకే గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం ప్రారంభించారు. కోటంరెడ్డి ప్రతి ఇంటికి వెళ్లి స్థానిక ప్రజలను పలకరించి వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆరా తీస్తూ స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని కోటంరెడ్డి హామీ ఇచ్చారు.