కోనసీమ: సఖినేటిపల్లి మండలం ఉయ్యూరు వారి మెరక గ్రామ పంచాయతీ పరిధిలోని యలంకాయల కలవ గట్టు వద్ద సీసీ రోడ్డు నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. సుమారు గ్రామ పంచాయతీ నిధులు 5 లక్షలు, మండల పరిషత్ నిధులు 3 లక్షలతో 106 మీటర్లు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.