నెల్లూరు: ఉదయగిరి మండల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల HMలకు సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ -2 తోట శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉదయగిరిలోని స్త్రీ శక్తి భవన్లో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జీవో 117 సంబంధించి HMలతో స్కూల్ కాంప్లెక్స్ వారీగా సూచనలు, సలహాలు, అభిప్రాయాలు చర్చించనున్నట్లు పేర్కొన్నారు.