ప్రకాశం: మార్కాపురం నూతన ఎంపీడీవోగా బాల చెన్నయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మార్కాపురం అభివృద్ధికి తమ సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఇందులో భాగంగా బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవోను సిబ్బంది శాలువా, పూలమాలతో సన్మానించారు. అనంతరం అన్నీ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.