»A Group Of World Bank Representatives Met With Cm Jagan
World Bank : సీఎం జగన్తో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల బృందం భేటీ
ముఖ్యమంత్రి జగన్ తో (CM JAGAN) ప్రపంచబ్యాంకు ప్రతినిధి బృందం భేటీ అయింది. భారత్ లో ప్రపంచబ్యాంకు డైరెక్టర్ (Auguste Tano Koume) నేతృత్వంలో బృందం భేటీ జరిగింది. ప్రపంచబ్యాంకు ఆర్థిక సహాయంతో అమలవుతున్న మూడు కార్యక్రమాలపై సమీక్ష చేశారు. ఏపీ ప్రజారోగ్య బలోపేతం, ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ (సాల్ట్), ఏపీ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్(ఏపీఐఐఏటీపీ) ప్రాజెక్టులు అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి జగన్ తో (CM JAGAN) ప్రపంచబ్యాంకు ప్రతినిధి బృందం భేటీ అయింది. భారత్ లో ప్రపంచబ్యాంకు డైరెక్టర్ (Auguste Tano Koume) నేతృత్వంలో బృందం భేటీ జరిగింది. ప్రపంచబ్యాంకు ఆర్థిక సహాయంతో అమలవుతున్న మూడు కార్యక్రమాలపై సమీక్ష చేశారు. ఏపీ ప్రజారోగ్య బలోపేతం, ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ (సాల్ట్), ఏపీ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్(ఏపీఐఐఏటీపీ) ప్రాజెక్టులు అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రపంచబ్యాంకు (World bank) భారత్ విభాగానికి డైరెక్టర్ (Auguste Tano Koume) మాట్లాడుతూ.. ఏపీ రావడం ఇదే తొలిసారి. వివిధ రంగాల్లో మీరు చేరుకున్న లక్ష్యాలను ప్రత్యక్షంగా మేం చూశాం. ఒక ప్రభుత్వం తన ప్రజలకు ఏ విధంగా సేవలు అందించగలదు.. అనే దానికి మీరు ఉదాహరణగా నిలిచారు.
దీనికి మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నా.. మంచి వైద్యం, ఆరోగ్యం (health) మంచి విద్యను ఎలా అందించవచ్చు? అన్నదానికి మీరు చక్కటి మార్గాన్ని చూపారు. నిర్దేశిత సమయంలోగా సేవలను పౌరులకు అందించడంలో మీరు గొప్ప ఉదాహరణగా నిలిచారుదేశంలో దాదాపు 22 రాష్ట్రాలకు మేం రుణాలు ఇస్తున్నాం. వివిధ రంగాల్లో వృద్ధికోసం ఈ రుణాలు ఇస్తున్నాం. మీ రాష్ట్రాన్ని మిగిలిన రాష్ట్రాలు ఒక ఉదాహరణగా తీసుకుని ముందుకు సాగవచ్చు. రాష్ట్రంతో మా భాగస్వామ్యం చాలా రోజులుగా కొనసాగుతోంది. వచ్చే పాతికేళ్లలో మీ విజన్ కు, మీ మిషన్ కు (Mission) ఈ సహకారం కొనసాగుతుందన్నారు. 2047 నాటి దేశంలానే, రాష్ట్రం కూడా మంచి ఆదాయం ఉన్న రాష్ట్రంగా మారడానికి తగిన సహకారం, మద్దతు మా నుంచి కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో మొత్తం స్కూళ్ల రూపు రేఖలన్నీ మారుస్తున్నాం. 12 రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం.
6వ తరగతి నుంచి ఐఎఫ్పీ ప్యానెల్స్ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే జూన్ (June) కల్లా వీటిని ఏర్పాటు చేస్తున్నాం. దీంతో బోధనా పద్ధతులను పూర్తిగా మార్చివేస్తున్నాం. డిజిటలైజేషన్ (Digitization) దిశగా వేస్తున్న పెద్ద అడుగు. రాష్ట్రంలో ఆరు పోర్టులు ఉన్నాయి, మరో నాలుగు వస్తున్నాయి. ఈ పోర్టు ఆధారిత పారిశ్రామిక వ్యవస్థలకు అవసరమైన నైపుణ్యం ఉన్న మానవవనరులను రాష్ట్రంలోనే తయారవుతాయి. ఈ కార్యక్రమాల్లో ప్రపంచబ్యాంకు భాగస్వామ్యం కావాలని కోరుతున్నా. వైద్యారోగ్యశాఖలో(Department of Health)కొత్తగా సుమారు 40వేలమందికిపైగా సిబ్బందిని రిక్రూట్ చేశాం. 17 కొత్త మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలవుతోంది. ఆరోగ్యశ్రీని అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తున్నాం.’ అని సీఎం జగన్ (CM Jagan)వివరించారు.