ASR: అరకులోయ మండల బీజేపీ అధ్యక్షుడిగా పాంగి మురళిని బీజేపీ సంస్ధా గత ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు ముఖ్యఅతిధులుగా హజరైన జిల్లా అధ్యక్షులు పాంగి రాజారావు మురళీకి అభినందనలు తెలిపారు. పార్టీ పటిష్టతకు కృషిచేస్తానని, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని పాంగి మురళి అన్నారు. ఈ ఎన్నికలో మండలంలోని 56 బూత్ కమిటీ అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.