ప్రకాశం: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 11, 12, 13 తేదీలలో నెల్లూరులో జరిగిన అండర్-17 రాష్ట్రస్థాయి హాకీ పోటీలలో మద్దిపాడు విద్యార్థిని సత్తా చాటింది. ప్రకాశం జిల్లా జట్టు తరఫున మద్దిపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి అను ప్రతిభ కనబరిచి రాష్ట్రజట్టుకు ఎంపికైంది. జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచిలో జరగబోయే జాతీయస్థాయి పోటీల్లో అను పాల్గొన్నారు.