విశాఖ మధురవాడలోని ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈనెల 21, 23 తేదీలలో జరగనున్న భారత్-శ్రీలంక మహిళల టీ20 మ్యాచ్ల టికెట్ల విక్రయాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. క్రికెట్ అభిమానులు ఈ టికెట్లను ‘డిస్ట్రిక్ట్’ యాప్ ద్వారా కొనుగోలు చేసుకో వచ్చని నిర్వాహకులు తెలిపారు. టికెట్ ధరలను 200,300, 350, 400గా నిర్ణయించారు.