E.G: నగరంలోని ప్రత్యేక మహిళా కారాగార సూపరింటెండెంట్ సీహెచ్. వసంతకుమారి బుధవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని కలిశారు. ఈ సందర్భంగా మహిళా ఖైదీల కోసం అమలు చేస్తున్న పరివర్తన కార్యక్రమాలు, వారు తయారు చేస్తున్న ఉత్పత్తుల వివరాలను కలెక్టర్‌కు వివరించారు. అనంతరం ఖైదీల పరిస్థితులను పరిశీలించేందుకు జైలును సందర్శించాలని కలెక్టర్‌ను ఆమె కోరారు.