TPT: సత్యవేడు మండలంలో 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు ఉపాధి హామీ నిధులతో పూర్తయిన పనులకు సంబంధించిన సామాజిక తనిఖీ బహిరంగ సభ ఈరోజు(శుక్రవారం) ఉదయం 10 గంటలకు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో జరుగుతుందని ఏపీవో కృష్ణయ్య పేర్కొన్నారు. డ్వామా పీడీ శ్రీనివాస్ ప్రసాద్ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు.