CTR: PM విశ్వకర్మ యోజన పథకం కింద అర్హులైన వారికి రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్లు సహకరించాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం సచివాలయంలో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఇందులో PM విశ్వకర్మ యోజన కింద బ్యాంక్ రుణాలు మంజూరుకు సంబందించి DRDA, మెప్మా PDలు, LDM, నైపుణ్యాభివృద్ధి అధికారి, బ్యాంకుల మేనేజర్లతో సమీక్షించారు.