HNK: పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు జిలారీ వాడలో శుక్రవారం స్థానిక కౌన్సిలర్ సంపత్ కుమార్ కరెంట్ పోల్స్‌కు వీధి దీపాలను ఏర్పాటు చేయించారు. వార్డు ప్రజలకు విద్యుత్ విషయంలో ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కౌన్సిలర్ చెప్పారు. అనంతరం స్థానిక ప్రజలతో కౌన్సిలర్ మాట్లాడి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.