సత్యసాయి: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 23న చెరువు నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించనున్నట్లు అగలి తహశీల్దార్ కరణం సుబ్బారావు పేర్కొన్నారు. చెరువు నీటి ఎన్నికలకు సంబందించి ఆయకట్టు దారుల జాబితాను ఆయా గ్రామ సచివాలయాల వద్ద ప్రకటించనున్నట్లు తెలిపారు. ఓటరు జాబితాపై అభ్యంతరాలు ఉంటే స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో తెలపాలని సూచించారు.