SKLM: శ్రీకాకుళం పట్టణానికి చెందిన యాగాటి ఉదయ్ అనే యువకుడు శ్రీకాకుళం నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేశాడు. యువత డ్రగ్స్‌కి బానిసలు కాకూడదని, ఆడవారిని గౌరవించాలనే నినాదంతో గత నెల15న సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఈనెల 7న గురువారం నాటికి కన్యాకుమారికి చేరుకున్నారు. 1900 కిలోమీటర్ల సైకిల్ యాత్రను 22 రోజుల్లో పూర్తి చేశాడు.