NLR: విడవలూరు మండల ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశ కార్యక్రమాన్ని ఈనెల 12వ తేదీన నిర్వహిస్తున్నట్లు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి నగేష్ కుమారి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. మండలంలో ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలను ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుందని తెలిపారు. ప్రజా ప్రతినిధులు అధికారులు అందరూ హాజరుకావాలని కోరారు.