అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని డెమొక్రాట్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమికి అధ్యక్షుడు జో బైడెనే కారణమంటున్నారు. ఈ క్రమంలో హారిస్ తీరునూ పలువురు నేతలు తప్పుబడుతున్నారు. ‘ఉపాధ్యక్షురాలిగా బైడెన్ మానసిక పరిస్థితి సరిగా లేదని ముందే తెలిసి కూడా సకాలంలో బయట పెట్టలేదు. దానికి తోడు బైడెన్ స్థానంలో అధ్యక్ష అభ్యర్థిగా ఖరారైన తర్వాత కూడా ఆయన నీడ నుంచి బయట పడలేదు’అంటూ వారు ఆక్షేపిస్తున్నారు.