NLR: ప్రియుడి వేధింపులు తాళలేక ఓ మహిళ సూసైడ్ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు YSR నగర్లో శివలక్ష్మి (34), ఆమె కుమార్తె యక్షిత నివాసముంటున్నారు. సింగరాయకొండ (M) బింగినపల్లికి చెందిన శివకుమార్ ఆమెతో నాలుగేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 20న ఇద్దరి మధ్య విదాదం జరగడంతో శివలక్ష్మి ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.