ASR: అరకు ఏపీఆర్ స్కూల్లో ఇద్దరు తప్పిపోయిన విద్యార్థులను డుంబ్రిగుడలో గుర్తించామని ఎస్సై పాపినాయుడు శనివారం తెలిపారు. విద్యార్థులు చింతపల్లి ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించి స్టేషన్కు తీసుకుని వెళ్లి, అనంతరం వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామన్నారు. తల్లిదండ్రుల సమక్షంలో బాగా చదువుకోవాలని విద్యార్థులకు కౌన్సిలింగ్ చేసి, వారిని అప్పగించామని తెలిపారు.