ATP: గుంతకల్లు-హిందూపురం-గుంతకల్లు మధ్య తిరిగే ప్యాసింజర్ రైళ్లను ఒకరోజు దారి మళ్లించి నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే సీఆర్వో శ్రీధర్ శనివారం తెలిపారు. పాత కొత్తచెరువు స్టేషన్లో జరుగుతున్న మరమ్మతుల కారణంగా నవంబర్ 26న ఒక్కరోజు హిందూపురం వెళ్లే ప్యాసింజర్ రైలు గుళ్య పాలెం, వెంకటాంపల్లి మీదుగా ప్రయాణిస్తుంది. ఈ మార్పును ప్రయాణికులు గమనించాలని కోరారు.