విశాఖ ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు సందర్శకుల తాకిడి పెరిగింది. సంక్రాంతి సెలవులు కావడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు విశాఖ జూను సందర్శించారు. దీంతో జూలో సందడి వాతావరణం నెలకొంది. సందర్శకుల ద్వారా ఆదివారం ఒక్కరోజు రూ.3.84 లక్షల ఆదాయం సమకూరినట్లు జూ క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. సందర్శకులకు అవసరమైన సౌకర్యాలను కల్పించామన్నారు.