అనకాపల్లి: ముత్యాలమ్మ పాలెం సముద్రతీరంలో శనివారం స్నానానికి దిగి గల్లంతైన 10వ తరగతి విద్యార్థి భాను ప్రసాద్ (15) కోసం సీఐ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయినా ఆచూకీ లభించలేదు. డ్రోన్ సహాయంతో వేతికినా ఫలితం కనిపించలేదు. కుటుంబ సభ్యులు తీరం వద్ద ఎదురు చూస్తున్నారు. ఈ ఘటనపై సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.