TPT: హెల్మెట్ వినియోగంపై పోలీసులు శుక్రవారం రాత్రి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు చంద్రగిరి సీఐ సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం స్థానిక టవర్ క్లాక్ దగ్గర వాహనదారులకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల్లో 70% హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారే మృతి చెందుతున్నారని.. అందుకే హెల్మెట్ ధరించాలని సూచించారు.