GNTR: జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో 32 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి మధ్యలోనే ఈ విధంగా ఎండలు ఉండగా.. రానున్న రోజుల్లో ఎండలు మరింత ఎక్కువగా ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు మధ్యాహ్న సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.