ELR: చింతలపూడి మండలం బోయగూడెం గ్రామానికి చెందిన అక్కల రామచంద్రరావు అనే వ్యక్తి మోటార్ సైకిల్ కొన్ని రోజుల క్రితం అదే గ్రామంలో దొంగతనానికి గురైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు భీమడోలు పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేశారు. దొంగతనానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను భీమడోలు పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి 4 మోటర్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.