ASR: ముంచింగిపుట్టు మండలంలోని బూసిపుట్టు మాజీ సర్పంచ్ వంతల మంగ్లన్న శ్రమదానంతో ప్రధాన రహదారిలో ఏర్పడిన గుంతలను పూడచ్చారు. ఆయన మాట్లాడుతూ.. గుత్తేదారుల నిర్లక్ష్యంతో రోడ్లు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయన్నారు. గత ఏడాది నాణ్యత ప్రమాణాలు ఏమాత్రం పాటించకుండా నిర్మాణాలు చేపట్టారన్నారు. దీంతో రోడ్డు వర్షాలకు దెబ్బతిని మట్టి కొట్టుకుపోయిందన్నారు.