SKLM: లావేరు మండలం గోవిందపురం పంచాయతీకి చెందిన వైసీపీ నాయకులు ఇజ్జు మిరియా తండ్రి ఇటీవల మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైసీపీ నాయకులు పిన్నింటి సాయికుమార్ వారి కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయనతోపాటు మాజీ ఎంపీటీసీ రాంబాబు, వైసీపీ నాయకులు నాగయ్య, గంగు నాయుడు, అప్పలనాయుడు, శ్రీనివాస, తదితరులు ఉన్నారు.