KDP: మైలవరం రిజర్వాయర్లో 4.70 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు సోమవారం అధికారులు వెల్లడించారు. రిజర్వాయర్ నుంచి MRNCకి 70, MRSCకి 200, RTPPకి 36 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నట్లు వెల్లడించారు. రిజర్వాయర్లో 653.52 అడుగుల వద్ద నీటి మట్టం ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మైలవరం రిజర్వాయర్లోకి ఇన్ ఫ్లో ఏమీ లేదన్నారు.