శ్రీకాకుళం: కంచిలి మండలం ఘాటి ముకుందపురం గ్రామంలో శ్రీ త్రినాథ స్వామి (బ్రహ్మ, విష్ణు, మహేశ్వర) మందిర ప్రతిష్ఠ కార్యక్రమం బుధవారం వైభవంగా జరిగింది. ఈ మేరకు విగ్రహాలను గ్రామంలో ఊరేగింపు నిర్వహించి ప్రతిష్ఠ చేశారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో పెద్దలు, మహిళలు, కమిటీ సభ్యులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.