E.G: రాజమండ్రి పరిసర ప్రాంతాలలో రాత్రి వేళల్లో ప్రజలు ఒంటరిగా తిరగవద్దని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 112కు ఫోన్ చేయాలని ధవలేశ్వరం సీఐ గణేష్ సూచించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. దోపిడీలకు, దాడులకు పాల్పడే మధ్యప్రదేశ్‌కి చెందిన ‘ధార్ గ్యాంగ్’ తూ.గో జిల్లా పరిసరాల ప్రాంతాల్లో తిరుగుతోందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.