VZM: ఉత్తరాంధ్ర జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు నాగబాబు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, పార్టీ బలోపేతంపై చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అనంతరం నాగబాబు ఎమ్మెల్యేను సన్మానించారు.