VZM: జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యం నాయుడు రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆదివారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత నమోదు కావాలన్నారు. అంతకుముందు అంగన్వాడీ కార్యకర్తల ఆరు రోజులు పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు అందజేశారు.