VSP: విశాఖపట్నం, గాజువాకలో వినాయక చవితి నిమజ్జనం ఏర్పాట్లను పోలీసులు, జీవీఎంసీ అధికారులు సోమవారం సాయంత్రం పర్యవేక్షించారు. న్యూపోర్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కామేశ్వరరావు, ఎస్సై శ్యామ్ సుందర్‌రావుతో పాటు జీవీఎంసీ అధికారులు యారాడ బీచ్‌ను సందర్శించి, నిమజ్జనం కోసం చేపట్టిన పనులను పరిశీలించారు.