AKP: పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేయాలని వైసీపీ అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ అన్నారు. ఆదివారం అనకాపల్లి రింగ్ రోడ్డులో గల వైసీపీ క్యాంపు కార్యాలయంలో ఆయన పార్టీ శ్రేణులతో సమావేశమై మాట్లాడారు. పార్టీ శ్రేణులందరూ సమిష్టిగా పని చేయాలన్నారు. అనంతరం భవిష్యత్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.