NLR: జిల్లాలో ఇసుక మాఫియా పెట్రేగి పోతుంది. రాత్రి అయితే చాలు టిప్పర్ల ద్వారా అక్రమ ఇసుకను యదేచ్ఛగా తరలిస్తున్నారు. ఈ మేరకు పొట్టే పాలెం నుండి అక్రమ ఇసుకను తరలిస్తున్న 8 టిప్పర్లను గురువారం తెల్లవారుజామున బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.