KDP: కడప-చెన్నై జాతీయ రహదారి కనుమలో పల్లిలో వెలసిన శ్రీ మందగిరిశనేశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశి పురస్కరించుకుని స్వామి వారికి విశేష పూజలు జరిగాయి. జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి తైలాభిషేకం, పూజలు నిర్వహించారు. శనీశ్వరుడికి పూజలు చేస్తే సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్ముతారు.