ప్రకాశం: కంభం మండలంలోని రావిపాడు గ్రామంలో సొంత బాబాయి పై కుమారుడు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అభిషేక్ రెడ్డి తన బాబాయి అయిన శ్రీనివాసరెడ్డిని ద్విచక్ర వాహనం కొనివ్వాలని కోరగా, బాబాయి నిరాకరించడంతో కోపంతో అభిషేక్ రెడ్డి బాబాయి పై దాడికి పాల్పడినట్లు ఎస్సై నరసింహ రావు తెలిపారు. కాగా, దాడి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.